{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584159894705","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584159798501","source":"other","origin":"unknown"}

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవి అన్నా రు. ప్రజలు భయాందోళన చెందవద్దని ఆమె సూచించారు. వరంగల్‌ ఎంజీఎంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడు తూ.. ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వ్యక్తి నివేదిక ఇంకా రాలేదన్నారు. రోగిని సందర్శించి పర్యవేక్షించామన్నారు. అలాగే నిట్‌ను సందర్శిం చి రిజిస్టార్‌, నిట్‌ డిస్పెన్సర్‌ వైద్యాధికారులతో సమావేశాల నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్త లు వివరించామన్నారు.

పోస్టర్లు, కరపత్రాలు అన్ని చోట్లా ప్రదర్శించాలని సూచించామన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులుకానీ, అధ్యాపకులు కానీ ఏ లక్షణాలు లేనప్పటికీ వారిని 14 రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలని తెలిపారు. నిట్‌ వైద్యులు పరీక్షలను నిర్వహిస్తూ ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలన్నారు.

జలుబు, దగ్గు ఉన్నవారితో దూరంగా ఉండాలని సూచించారు. చేతులను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని, వేడుకలు ఉన్న ప్రాంతాలలో తగు జాగ్రత్తలను పాటించాలన్నారు. సమావేశంలో ఆమె వెంట అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.మదన్‌మోహ న్‌రావు, జిల్లా సర్వలెన్స్‌ అధికారి డాక్టర్‌ కృష్ణారా వు, డాక్టర్‌ నాగరాజు, డెమో అశోక్‌రెడ్డి, సభ్యు లు రాజేంద్రప్రసాద్‌, విప్లవ్‌కుమార్‌, సురేష్‌, నాగయ్య, రత్నశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.