వరంగల్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ జైలును మరో ప్రాంతానికి తరలించి, అక్కడ అన్ని హంగులతో ఎంజీఎం ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి త్వరలోనే మాస్టర్‌ ప్లాన్‌-2041 విడుదల కానుందని తెలిపారు. హన్మకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలక మండలి(జీడబ్ల్యూఎంసీ) కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్‌లో ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి రావాల్సి ఉందన్నారు.