{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":1,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"total_editor_time":111,"brushes_used":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582440513584","total_effects_time":0,"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582440579628","sources":["238909876100202","229767683022202"],"layers_used":0,"width":4096,"height":2048,"subsource":"done_button"}

వరంగల్ అంటే తనకు ఎంతో ప్రేమ, ఈ జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వరంగల్‌లో ని ఏవీవీ కాలేజీలో ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన వెంకయ్య ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏవీవీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు చందా కాంతయ్య పలువురికి ఆదర్శమన్నారు.

నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు :

‘నాటి నిజాం పాలకులను మెప్పించి తెలుగుభాషలో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం స్ఫూర్తి దాయకం. సాహిత్య, సాంస్కృతికతకు పుట్టినిల్లు ఓరుగల్లు. దాశరథి, కాళోజీ, పీవీ నరసింహారావు వరంగల్‌కే కాదు తెలంగాణకే గర్వకారణం. సాంస్కృతిక వారసత్వం, రామప్ప, వేయిస్తంబాల దేవాలయాలు వరంగల్ కే తలమానికం. వారసత్వ సంపదగా వచ్చిన చెరువులను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చెరువుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్‌కు స్మార్ట్ సిటీ ఇచ్చాం. పలు ఇంగ్లీషు రచనల్లో కాకతీయుల కళావైభనం గురించి రాశారు. పలు విద్యాసంస్థలతో విద్యాకేంద్రంగా వరంగల్ విరాజిల్లుతోంది. మన అస్తిత్వమైన తెలుగుభాషను కాపాడడానికి చందా కాంతయ్య చేసిన కృషి అభినందనీయం’ అని ప్రశంసల వర్షం కురిపించారు.

మాతృభాషను మరవొద్దు:

‘తల్లిదండ్రులను, జన్మభూమిని, మాతృభాష ఎప్పటికీ మరవొద్దు. పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా మాతృభాష నిరాధారణనకు గురవుతోంది. భారత ప్రధాని, నేను అంతా మాతృభాషలోనే విద్యనేర్చుకున్నాం. బహుభాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవొద్దు. ప్రాథమిక విద్యా మాతృభాషలోనే జరగాలి లేదంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. మానవజీవన వికాసంలో చదువు పాత్ర ఎంతోముఖ్యం’ అని వెంకయ్య చెప్పుకొచ్చారు.