{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1624553631506","source":"other","origin":"gallery"}
  • ఉమ్మడి వరంగల్ లో ప్రైవేట్ ఆస్పత్రి దోపిడీపై హైకోర్టు సీరియస్.
  • కరోనా పేషెంట్ పట్ల మానవత్వం మరిచి ప్రవర్తించిన యాజమాన్యం.
  • నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న అజరా ఆస్పత్రి.
  • 12 రోజుల చికిత్సకు రూ 12 లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి.

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ అజార్ ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తోందని జిల్లా జడ్జి నందికొండ నర్సింగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 రోజుల చికిత్సకు రూ 12 లక్షలు వసూలు చేయడం ఏమిటని, ఆజార్ ఆస్పత్రి పై వెంటనే చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను జిల్లా జడ్జి ఆదేశించారు. బాధితులకి ఫీజును తిరిగి ఇప్పించాలని కోర్టు సూచించింది.