{"subsource":"done_button","uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1608831451308","source":"other","origin":"gallery","source_sid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1608892592891"}

వివాహేతర సంబంధం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇలాంటి సంబంధాలు ఎంత ఎంతటి దు:ఖానికి దారి తీస్తాయో మరోసారి చాటి చెప్పే ఘటన ఒకటి వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది. అక్రమంగా సంబంధం ఏర్పరచుకోవడం వల్ల పరువు పోయినట్లు భావించి వారు ఏకంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివీ: వరంగల్ అర్బన్ జిల్లా పెద్దజాలు గుంట వద్ద ఇద్దరు వ్యక్తులు (అత్త, అల్లుడు) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతి చెందిన వారు బాకాటి సుమన్(35), ముల్కనూరుకు చెందిన సుంచు మాధవి(35)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమన్‌ అనే వ్యక్తి మాధవికి అల్లుడు వరస అవుతాడని తెలుస్తోంది.

వారిద్దరికీ వరస కుదరకపోవడంతో ఈ విషయం అందరికీ తెలియడంతో వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వరంగల్ రూరల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలోని పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.