దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ అత్యవసర చికిత్స కోసం హస్పటలకు తరలి వచ్చే పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు అత్యవసర వైద్య చికిత్స అందించాల్సిందిగా డాక్టర్లకు వరంగల్ పోలీస్ కమీషనర్ సూచించారు. పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వరంగల్ విభాగం మరియు ప్రవైయిట్ నర్సింగ్ హెూమ్స్ అసోసియోషన్‌కు చెందిన డాక్టర్లతో వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ:

శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల అరోగ్యాలను దృష్టి వుంచుకోని అత్యవసర వైద్య చికిత్స కోసం వచ్చే పోలీసుల సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ వైద్యులకు సూచించడంతో పాటు చికిత్స సమయంలో వసతి సౌకర్యాలపై డాక్టర్లు, ప్రవైయిట్ నర్సింగ్ హెూమ్స్ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ వైద్యులను కోరారు. ఈ సమావేశంలో అదనపు డి.సి.పిలు వెంకట లక్ష్మీ, తిరుపతి, గిరిరాజు, భీంరావు, ఎ.సి.పిలు జనార్దన్, జితేందర్ రెడ్డి, ప్రతాప కుమార్, ఇన్స్పెక్టర్లు దయాకర్, గణేష్, ఆర్.ఐలు భాస్కర్, శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్, ఐ.యం.ఎఫ్ అధ్యక్షుడు డా. శ్రీనివాస్, కార్యదర్శి డా.లక్ష్మీనారయణ, కోశాధికారి డా. అరిట్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ డా. కాళీప్రసా’ పాటు తానా అధ్యక్షుడు డా. రాకేష్, తానా సభ్యులు డా. ప్రవీణ్, రాకేష్ రెడ్డి, ఇతర డాక్టర్లు విజయచందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శేషుమాధవ్ పాల్గొన్నారు.