పర్వతగిరి మండలం కళ్యాణ గ్రామంలోని RDF అచ్యుతాపాయ్ జూనియర్ కళాశాలకి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న జీవంజి దీప్తి అథ్లెటిక్ పొటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ యాకయ్య తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ నెల 15,16 తేదీల్లో కర్ణాటకలో అండర్ 18 గర్ల్స్ సౌత్ జోన్ అథ్లెటిక్ మీట్ నిర్వహించారు.ఈ పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో దీప్తి బంగారు పతకాన్ని గెలుచుకుంది. 200 మీటర్ల పరుగు పందెంలో 24.84 సెకండ్లలో పూర్తి చేసి న్యూ మీట్ రికార్డును సృష్టించింది. అథ్లెటిక్ పొటీల్లో బంగారు పతకాన్ని సాధించిన దీప్తిని ఆర్ డిఎఫ్ వ్యవస్థాపకులు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ యాకయ్య దీప్తిని అభినందించారు.