వరంగల్ అర్బన్ జిల్లా: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ శివారులోని పక్కిరోని గుట్టవద్ద గల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బాలికలు వారం రోజులుగా నీటికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో విద్యార్థినిల కోసం బోరు వేశారు. కానీ వారం రోజుల క్రితం బోరు మోటార్ కాలిపోయింది. సకాలంలో పాఠశాల సిబ్బంది మోటారు మరమ్మత్తు చేయించక పోవడంతో వారం రోజులుగా నీటికోసం అల్లాడుతున్నారు. విద్యాలయం చుట్టుప్రక్కల వెళ్లి నీటిని తెచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే మోటార్ మరమ్మత్తు చేయించాలని విద్యార్థిలను కోరుతున్నారు. వారం రోజులుగా విద్యార్థినిల ఇబ్బందులు బయటకు రాకుండా చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఈ బోరుమోటర్ విషయం బయటకు వచ్చిందని పిల్లలు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న దిక్కు ఎవరు లేరని ఈ విషయాన్ని అందరు గమనించాలని, అధికారులు దీనిని త్వరగా మోటార్ బాగు చేయాలని కోరారు.