వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వ్యాపార సముదాయాల్లోని దుకాణాలను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడతున్న అంతర్‌ రాష్ట్ర దోంగ రాజస్థాన్‌ రాష్ట్రం, ఆజ్మీర్‌ జిల్లాకు చెందిన హుస్సేన్‌ ఆలియాస్‌ హుస్సేన్‌ కటాత్‌పై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదివారం పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మట్వాడా ఇన్స్‌స్పెక్టర్‌ గణేష్‌ వరంగల్‌ కేంద్రకారాగారంలో వున్న నిందితులకు జైలర్‌ సమక్షంలో పీ.డీయాక్ట్‌ నిర్బంధ ఉత్తర్వులను అందజేయబడింది.

పీడీ యాక్ట్‌ అందుకున్న నిందితులు తాళం వేసివున్న షటర్ల్‌ లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడేవాడు. నిందితుడు ఇదే తరహలో జూలై మాసం నుండి సెప్టెంబర్‌ మాసం మధ్య కాలంలో నిందితుడు హుస్సేన్‌ కటాత్‌ మిగితా నిందితులతో కల్సి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఐదు చోరీలకు పాల్పడ్డారు. ఇందులో ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెల్‌షాపు మరియు ట్రావేల్‌ ఏజెన్సీలో దోపీడీకి పాల్పడి 65వేలు నగదుతో పాటు, ఒక ల్యాప్‌టాప్‌కు దొంగలించగా, ఆగస్టులో మాసంలో మట్వాడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మందుల ఏజెన్సీలో 50వేల రూపాయలు చోరీతో పాటు,

గత సెప్టెంబర్‌ 28తేదిన వరంగల్‌ బట్టలబజార్‌లోని రెండు దుకాణాల షట్టర్ల తాళాలు పగులగోట్టి 22వేల రూపాయల నగదుతో పాటు బంగారు, వెండి నాణేనాలు దోచుకోవడంతో పాటు ఇదే ప్రాంతంలోని ఒక బట్టదుకాణానికి సంబంధించిన అకౌంట్స్‌ కార్యాలయములోకి ప్రవేశించి సూమారు 16లక్షల 50వేల రూపాయల విలువ గల బంగారు బిస్కేట్లు, అభరణాలు చోరీ చేసారు. ఇదే తరహలో నిందితుడు ఈ సంవత్సరం మార్చ్‌ మాసం నుండి ఇప్పటి వరకు మొత్తం 14 దోపీడీలకు పాల్పడ్డారు. ఇందులో నిందితులు ఇతర రాష్ట్రాలైన అంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుడివాడ, ఒంగోలు, అస్సాంలోని గౌహతి, మహరాష్ట్రలోని బలార్ష ప్రాంతాల్లో వ్యాపార సముదాయాల్లోని షాపుల షటర్‌ తాళాలను తోలిగించి దోపీడీలకు పాల్పడ్డాడని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.