హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ఆకాశవాణి 30 వసంతాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, విశిష్ట అతిథులుగా స్టేషన్ డైరెక్టర్ మణిమంజరీ దేవి, వరప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంపశయ్య నవీన్ మాట్లాడుతూ… రేడియోతో తనకున్న అనుభవాన్ని గురించి నెమరువేసుకున్నారు.

వరప్రసాద్ మాట్లాడుతూ…: 37 సంవత్సరాల నుండి రేడియోతో తన సంబందాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణ అధికారి గోపాల్ రావు మాట్లాడుతూ… రేడియోలో చేసిన కార్యక్రమాల ద్వారా రాష్ట్రపతి నుండి రెండు సార్లు అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందని, 30 సంవత్సరాల తన వృత్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.