తన అనారోగ్యాన్ని సైతం జయించి స్విమ్మింగ్‌ క్రీడల్లో పతకాలను సాధించిన కానిస్టేబుల్‌ శంకర్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం అభినందించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జి.యం.సి బాలయోగి స్విమ్మింగ్‌ కాంప్లెక్స్‌నందు ఈ నెల 15వ తేదిన నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ క్రీడల్లో దామేర పోలీస్‌ స్టేషన్‌ నందు కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్న గోర్రె శంకర్‌ 400, 200, 100 మీటర్ల ఫ్రీ స్టైల్‌ విభాగాల్లో మూడు రజిత పతకాలను సాధించడంతో పాటు, వచ్చే నెల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించే 16వ జాతీయ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ క్రీడలకు ఎంపికావడం జరిగింది.

గతంలో రాష్ట్ర స్థాయిలో స్విమ్మింగ్‌ క్రీడల్లో పతకాలను సాధిస్తున్న శంకర్‌ 2015 సంవత్సరంలో మూత్రపిండాల వ్యాధికి గురికావడంతో శంకర్‌ శరీరంలో ఒక మూత్ర పిండాన్ని తోలగించిన అధైర్య పడకుండా తనకు ఇష్టమైన క్రీడలో మరింత రాణించి రాష్ట్ర పోలీస్‌ క్రీడల్లో సైతం పలు పతకాలను సాధించడాన్ని తెలుసుకున్న పోలీస్‌ కమీషనర్‌ కానిస్టేబుల్‌ శంకర్‌ను అభినందించడంతో పాటు, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కృంగిపోకుండా మొక్కవోనే ధైర్యంతో వుండటంతో పాటు తన దైనందిత జీవితాన్ని కోనసాగించడంతో పాటు స్విమ్మింగ్‌ క్రీడలో పతకాలను సాధించిన కానిస్టేబుల్‌ శంకర్‌ ఇతర సిబ్బందితో పాటు క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడని పోలీస్‌ కమీషనర్‌ తెలిపారు. ఈ కార్యాక్రమములో వరంగల్‌ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్‌కుమార్‌ గౌడ్‌ పాల్గోన్నారు.