వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబాయి కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కుల పేకాట బెట్టింగ్కు పాల్చడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. ఇతని నుండి సుమారు 2కోట్ల 5లక్షల 14వేల రూపాయల నగదు, 7 సెల్ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించి. 43 పాసుకు, ఏటియం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ బుకీల అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు మాడిశెట్టి ప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ హఫీజ్ పేటలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోని రెడీమెడ్ బట్టల వ్యాపారం నిర్వహించుకోనేవాడు.

ఈ బట్టల వ్యాపారం ద్వారా తన కుటుంబ పోషణ కష్టం కావడంతో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలని కున్నాడు. ఇందుకోసం నిందితుడు హఫీజ్ పేటలో మరికొద్ది మంది స్నేహితులతో కల్పి 2016 నుండి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు. ఈ బెట్టింగ్ ద్వారా నిందితుడు పెద్ద మొత్తం డబ్బును సంపాదించడంతో పాటు 2018 సంవత్సరంలో తన స్నేహితులు ద్వారా స్మార్ట్ ఫోన్లో అన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ నిర్వహించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రసాద్ ముంబాయి కేంద్రంలో ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ నిర్వహకుడు మరో నిందితుడు అభయ్ తో పరిచయం అయింది. ఈ పరిచయం ద్వారా నిందితుడు ప్రసాద్ కి ఆన్లైన్ బెట్టింగ్ పై పూర్తిస్థాయిలో అవగాహన కలగడంతో పాటు, అభయ్ నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైడ్ ద్వారా నిందితుడు ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా నియమించబడ్డాడు.

దీనితో ఆన్లైన్ లో బెట్టింగ్ పాల్గోనేవారు ముందుగా అన్లైన్ ద్వారాగాని వ్యక్తిగతం డబ్బు చెల్లించిన వ్యక్తులకు అభయ్ నుండి నిందితుడికి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డలను వాట్సప్ ద్వారా బెట్టింగ్లో పాల్గొనే వ్యక్తులకు అందజేసేవాడు. వీటి ద్వారా ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ పాల్గొనేవారు. ఈ బెట్టింగ్లో గెలుపొందిన వ్యక్తులకు పందెం కాసిన డబ్బురు రెట్టింపు డబ్బు అందజేసేవారు. నిందితుడు ప్రసాద్ అందజేసే డబ్బులో కమిషనర్ మినహాయించి మిగితా డబ్బును అందజేసేవాడు. ఈ విధంగా రోజు వారిగా జరిగిన లావాదేవీల అనంతరం వచ్చిన లాభంలో నిందితుడు ప్రసాద్ వాటాలను అనసరించి బెట్టింగ్ వెబ్సైట్ నిర్వహకుడు అభయ్క అందజేసేవాడు. నిందితుడు ప్రసాద్ ఈ డబ్బు లావాదేవిలను నిర్వహించేందుకుగాను బీనామీ పేర్లపై బ్యాంక్  ఖాతాలను నిర్వహించేవాడు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ వ్యహరం మొత్తం వెబ్ సైట్ నిర్వహణ మొత్తం నిందితుల చేతుల్లో వుండటంతో మూడు ముక్కల పేకాట బెట్టింగ్ సమయంలో తక్కువ మొత్తం పందెం పెట్టిన వారిని ముందుగా గెలిపించి వారితో ఎక్కువ మొత్తంలో డబ్బు పందెం కాసేవిధంగా ప్రోత్సహించేవారు. ఇలా ఎక్కువ డబ్బును పందెం కాసినప్పుడు వారిని ఓడిపోయే విధంగా నిందితులు మోసం చేసేవారు.

ఈ క్రమంలోనే నిందితుడు మరో ఇద్దరు నిందితులతో కల్సి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 2019లో హైదరాబాద్ కమిషనరేటకు చెందిన చందానగర్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన అనంతరం నిందితుడు హైదరాబాద్లో తిరిగి అన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు గుర్తిస్తారని తన అత్తగారు నివాసం వుంటున్న హన్మకొండకు నిందితుడు ప్రసాద్ మకాం మార్చాడు. హన్మకొండ కేంద్రంగా చేసుకోని నిందితులు ఐపిఎల్, టి20-20 వర్ధల్కిష్తో పాటు మూడు ముక్కల పేకాట ఆన్లైన్ బెట్టింగ్ను బోరుగా నిర్వహిస్తున్న ప్రజలను మోసం చేయడంతో పాటు ఈ బెట్టింగ్ ద్వారా నిందితుడి చేతికి వచ్చిన డబ్బును బీనామీ పేర్లపై వున్న బ్యాంకు ఖాతాల్లో జమచేయడంతో పాటు వివిధ స్థిరాస్తులను కొనుగోలు చేసాడు. ఈ బెట్టింగ్లో మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులో నిందితులపై కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసును పోలీసులు నమోదు చేసుకోని సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా అధ్వర్యంలో కేయూసి

మరియు సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా కల్పి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడం జరిగింది. ఈ నిందితుల్లో ఒకడైన అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకోనేందుకుగా ఈరోజు ఉదయం మరో నిందితుడు ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా కెయూసి పోలీసులకు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బ్యాంక్ పాస్బుక్లు, ఏటియం కార్డులు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, కేయూసి ఇన్స్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఎస్.ఐ సంపత్. ఏ.ఏ.ఓలు ప్రశాంత్, సల్మాస్పోషా, హెడ్కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్ళు అశోక్, మధు, జగదీష్, కమాలకర్లను పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అభినందించారు.