హుజూరాబాద్‌: నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో హుజూరాబాద్‌ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన వైద్యురాలు కనుగుల గీతాంజలి ఆలిండియా స్థాయిలో 45వ ర్యాంకును సాధించారు. ఇటీవల ఎన్‌బీఈ ఈ పరీక్షను నిర్వహించగా ఈనెల 26న ఫలితాలను విడుదల చేశారు. యురాలజీ విభాగంలో ఈ ర్యాంకును సాధించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో ఒప్పంద పద్ధతిలో జనరల్‌ సర్జరీ విభాగంలో సహాయక ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.