వరంగల్‌ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన హుస్సేన్‌, యాకూబి దంపతులకు ఐదుగురు కుమారులు. పొలాలు, ఇళ్ల రూపంలో ఉన్న ఆస్తిని అందరికీ పంచి ఇచ్చారు. ఒక కుమారుడు కొన్నేళ్ల క్రితం మరణించగా, అప్పట్నుంచి అతని ఇంట్లోనే ఉంటూ పింఛను సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడికి ఎక్కువ ఆస్తి ఇచ్చారనే కారణం చూపుతూ నలుగురు కుమారులు గొడవలు పెట్టుకుని ఇంట్లోంచి బయటకు నెట్టేయడంతో ప్రస్తుతం వృద్ధ దంపతులు బస్టాపులోకి చేరారు. రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నామని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.