{"subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1585712093249","source":"other","origin":"unknown","sources":["319188294282201"],"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1585712160353"}

నగరపాలక సంస్థ 2020-21 వార్షిక బడ్జెట్‌ ఆమోదానికి కరోనా వైరస్‌ ప్రభావం కనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడింది. రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడు డాక్టర్‌ సత్యనారాయణ ఉత్తర్వులతో ఏప్రిల్‌ నెలకు సరిపడా అవసరాల కోసం తాత్కాలిక పద్దు సిద్ధం చేశారు.

అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తాత్కాలిక బడ్జెట్‌కు బుధవారం ఆమోదం తెలుపనున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా గ్రేటర్‌లో తొలిసారి నెలరోజుల అవసరాలకు తాత్కాలిక పద్దు రూపొందించారు. ఏప్రిల్‌ 30 వరకు ఖర్చులకు సరిపడా నిధులు ప్రతిపాదించారు. 2020-21 వార్షిక బడ్జెట్‌ రూ.294 కోట్లతో ప్రతిపాదించారు.

12/1 ప్రకారం ఏప్రిల్‌ నెల అవసరాల కోసం రూ.24.50 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎక్కువ నిధులు కేటాయించారు. సోడియం హైపోక్లోరైట్‌ రసాయనం, బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం బస్తాలు, శానిటైజర్లు కొనుగోలుకు అంచనాలు తయారు చేశారు.