కమిషనరేట్ పరిధిలో దారిదోపిడీలకు పాల్పడిన ఇద్దరు నేరస్థులపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలపై దారిదోపిడీలకు పాల్పతున్న అడెపు అనిల్, వయస్సు 27, కరీమాబాద్, వరంగల్ అర్బన్, ఎస్.కె రబ్బానీ,కరీమాబాద్, వరంగల్ అర్బన్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం పీ.డీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ డి.నరేష్ కుమార్ కేంద్రకారాగారంలోని నేరస్థులకు జైలర్ సమక్షంలో పీ.డీ నిర్బంద ఉత్తర్వులను అందజేశారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందుకున్న నిందితులు ఇద్దరు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏప్రిల్ మాసంలో ఉర్సు గుట్ట ప్రాంతంలో లారీలను ఆపి డ్రైవర్ మరియు లారీ క్లీనర్లను తీవ్రంగా కొట్టి వారిని బెదరించి వారి నుండి డబ్బుతో పాటు రెండు సెల్ ఫోన్ల దోపిడీలకు పాల్పడటంతో నేరస్థులను కాలనీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

నిందితుల్లో ఒకడైన ఆడెపు అనిల్ పై మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక దారి దోపీడీ కేసులు నమోదు కాగా మరో నిందితుడు రబ్బానీపై మీల్స్ కాలనీ పోలీస్ స్టేషనఖీ పరిధిలో రెండు దారి దోపీడీ కేసులు నమోదు కావడంతో నిందితులపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం పోలీసుల కర్తవ్యం, ఇందులో భాగంగా ప్రజల ఆస్తుల చోరీలకు పాల్పడినవారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము