వరంగల్ క్రైమ్ ఇన్విస్టిగేషన్‌లో ఉద్యోగాల పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని వందలాది మంది బాధితుల నుంచి 3 నుంచి 5 లక్షల వరకు కానుగంటి నవీన్ అనే వ్యక్తి వసూలు చేశాడు. తాము మోసిపోయినట్లు గుర్తించిన 13మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నవీన్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక గన్ను, నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన నవీన్ ఓ ప్రజాప్రతినిధి కొడుకుగా తెలుస్తోంది. నవీన్‌కు ఇటీవలే పెళ్లి జరిగింది. తాను సీబీసీఐడీలో పనిచేస్తున్నానని నమ్మించి నవీన్ రూ.20 లక్షలకు పైగా కట్నం తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..