వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగు వద్ద డబ్బులు వసూళ్ళకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సొమవారం అరెస్టు చేయగా మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల నుండి 21లక్షల 70వేల రూపాయల నగదు, రెండు ఖరీదైన కార్లతో పాటు రెండు సెల్‌ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నకిలీ పత్రాలు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించిన బెల్ట్, టోపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.చల్లా వినయ్ పాల్ రెడ్డి, తండ్రి పేరు భాస్కర్ రెడ్డి, వయస్సు 37, మైలారం గ్రామం, శాయంపేట మండలం, హన్మకొండ జిల్లా, 2. పోరిక అనసూయ, భర్తపేరు చల్లా వినయ్ పాల్ రెడ్డి, వయస్సు 36, సురేంద్రపురి కాలనీ, వడ్డెపల్లి, హన్మకొండ. 3.లావుడ్యా నవీన్ సాకేత్, తండ్రి పేరు కిషన్నాయక్, వయస్సు 27, పాశిగడ్డ తండా గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. 4.రాజ్ కె.పి.సిన్హా, దిల్లీ (ప్రస్తుతం పరారీలో వున్నాడు).

ఈ అరెస్టు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన వినయ్ పాల్ రెడ్డికి 2009 సంవత్సరంలో వి.ఆర్.ఓగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన నిందితుడు వినయ్ పాల్ రెడ్డి ములుగు జిల్లా బండారు పల్లె గ్రామ వి.ఆర్.ఓ విధులు నిర్వహించేవాడు. నిందితుడికి ఇదే సమయంలో ములుగు రెవెన్యూ విభాగం ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పోరిక అనసూయతో పరిచయం కావడంతో ఇరువురుకి గతంలో పెళ్ళిళ్ళు అయిన వీరు ఇరువురు కొద్ది కాలం సహజీవనం చేసి వివాహం చేసుకున్నారు. నిందితులిద్దరు రెవెన్యూ విభాగంలో ఉద్యోస్తులు కావడంతో నిందితులు ఇద్దరు నకిలీ దస్తావేజులు, డాక్యూమెంట్లను తయారు చేసి అవినీతికి పాల్పడటంతో 2012 సంవత్సరంలో నిందితులపై ములుగు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు.

కొద్ది కాలం అనంతరం నిందితులకు నకిలీ జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం కమిషనర్ రాజ్ కె.పి.సిన్హా అనే వ్యక్తితో దిల్లీలో పరిచయం అయింది. ఇతని ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూళ్ళ పాల్పడేందుకు నిందితులు ప్రక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితుల్లో ప్రధాన నిందితుడైన వినయ్ పాల్ రెడ్డి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఏ.పి విభాగం, భార్య పోరిక అనసూయను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ విభాగానికి కమిషనర్లుగా, మరో నిందితుడు సాకేతను అసిస్టెంట్ కమిషనర్‌గా నకిలీ హోదాలతో నిరుద్యోగులను మోసంచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా ద్వారా జిల్లా ఆర్గనైజేషన్ కమిషనర్ మరియు స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్ ఉద్యోగ నియామాలను చేపట్టడం జరుగుతుందని ప్రచారం చేయడంతో నిరుద్యోగులు ఉద్యోగాన్ని బట్టి ఒక్కోక్క నిరుద్యోగి నుండి సుమారు 5 లక్షల నుండి 3లక్షల వరకు డబ్బులు వసూళ్ళకు పాల్పడ్డారు. కొద్ది కాలం అనంతరం 2019 ఆగస్టు నుండి గత సంవత్సరం ఆగస్టు వరకు 241 మంది నిరుద్యోగులను వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో 15రోజుల పాటు శిక్షణ అందజేసి శిక్షణ అనంతరం వరంగల్, నర్సంపేట్, నెక్కోండ, హన్మకొండ, నల్గొండ, మంచిర్యాల్, ములుగు, కరీంనగర్ జిల్లా లోని వివిధ పాఠశాల్లో విధులు నిర్వహించాల్సిందిగా నకిలీ ఉత్తర్వులను అందజేసారు. నకిలీ ఉత్తర్వులతో ఆయా ప్రాంతాలకు విధులు నిర్వహించేందుకు ఉత్సహం వెళ్ళిన నిరుద్యోగులకు ఈ ఉత్తర్వులు నకిలీ అని తెలియడం కంగుతిన్నారు.

దీనితో బాధిత నిరుద్యోగులు ఈ ముఠా సభ్యులను నిలదీయటంతో పాటుతాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా నిందితులపై నిరుద్యోగులకు ఒత్తిడి చేయడంతో నిందితులు నిరుద్యోగులను బెదిరింపులు పాల్పడుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ట్క్ఫా ర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను విచారించగా వారు పాల్పడిన మోసాలను ఎదుట అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్పీ వైభవ్ గైఖ్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్ గణేష్, ఎస్.ఐ అశోక్ శ్రీనివాస్ జీ, సంతోష్, హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, శ్రీకాంత్, లియాఖత్ ఆలీ, సృజన్, మహేందర్, శ్రీనివాస్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.