వరంగల్‌: ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని విభాగాల ఉద్యోగులకు ఏక కాలంలో వేతనాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగేశ్వర్‌, పర్యవేక్షకురాలు ప్రసన్నరాణి, జేఏవో ఉమాకాంత్‌, సీనియర్‌ సహాయకులు సంతోష్‌, చార్లెస్‌ తదితరులు పాల్గొన్నారు.