వరంగల్ ఎంజీఎంలో ఆగని మృత్యుఘోష ఆగడం లేదు. ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు బయటకు వెల్లడించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆక్సిజన్ అందక తెలంగాణ ఉద్యమకారుడు, అడ్వకేట్ రాములు మృతి చెందారు. సరైన వైద్యం అందకే రాములు చనిపోయాడని బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యం చేయాలంటే వైద్యులు, నర్సులు భయపడుతున్నారు. చికిత్స అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఏబీఎన్ తో తమ బాధను బాధితులు మొరపెట్టుకుంటున్నారు.