వరంగల్ ఎంజీఎంలో మరో దారుణం జరిగింది. బెడ్లు ఖాళీలేవని కరోనా రోగిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. సకాలంలో వైద్యం అందక కరోనా బాధితుడు ప్రసాద్ మృతి చెందాడు. మృతుడు ములుగు జిల్లా వాజేడుకు చెందిన ప్రసాద్‌గా గుర్తించారు. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై రోగి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.