ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పీఏకు కరోనా పాజిటివ్‌ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో నిత్యం సందడిగా ఉండే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కరోనా పాజిటివ్‌ కేసుతో వెలవెలబోయింది. అతడి భార్య ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా నిర్వర్తిస్తున్నందున తన భార్య వద్దకు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో కరోనా వచ్చినట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. దీంతో క్యాంపు కార్యాలయానికి సంబంధించిన అన్ని రకాల అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రజలకు ఏదైనా అత్యవసర పనులంటే 99598 38414, 80081 92191, 93813 33314 సెల్‌నెంబర్‌లో సంప్రదించాలని ఎమ్మెల్యే కోరారు.