వరంగల్: బిసి, ఎస్సి , ఎస్టీ, మహిళల ఓటర్ల సర్వే పక్కా గా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం జిడబ్ల్యూ ఎంసి పరిధిలోని 66 డివిజన్లలో సర్వే జరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది వరంగల్ లోని ఎస్ ఎస్ ఆర్ తోట, కరిమాబాద్ లో సిబ్బంది నిర్వహిస్తున్న ఓటర్ల సర్వే తీరును పరిశీలించి సమర్ధంగా సర్వే చేయుటకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల ప్రకారం బల్దియా పరిధిలోని 66 డివిజన్లలో పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రతి ఇంటికి తు చ తప్పకుండా వెళ్లి బిసి, ఎస్సి, ఎస్టీ, మహిళల ఓటర్ల సర్వే చేయాలని అన్నారు. బల్దియా సిబ్బందికి తోడుగా రెవిన్యూ శాఖ వి ఆర్ ఓ లను కూడా నియమించినందున సమన్వయంతో వేగవంతంగా సర్వే చేయాలని సూచించారు. ఈ సర్వే ఎట్టిపరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం లోగా పూర్తి కావాలని, అందుకు రాత్రి వరకు సర్వే జరిగేలా సర్కిల్ ల వారీగా ఉప కమిషనర్ లు అనునిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మంగళవారం నాడు 66 డివిజన్లలో బిసి, ఎస్సి , ఎస్టీ, మహిళల ఓటర్ల సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది.

అదనపు కమిషనర్ నాగేశ్వర్, కాశిబుగ్గ, కాజిపేట్ సర్కిల్ కార్యాలయాల ఉప కమిషనర్ లు జానా, రవీందర్ యాదవ్, లు కూడా వారి వారి డివిజన్లలో బల్దియా ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న ఓటర్ల సర్వే తీరును పరిశీలించారు. ఈ సర్వేలో బల్దియా రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, ఆర్ ఐ లు, బిల్ కలెక్టర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, వి ఆర్ ఓ లు, చైన్ మెన్లు తదితరులు పాల్గొన్నారు.ఓటర్ల జాబితాలో కమిషనర్ ఓటు పరిశీలన,బిసి, ఎస్సి , ఎస్టీ, మహిళల ఓటర్ల సర్వేలో భాగంగా మంగళవారం సాయంత్రం బాలసముద్రం లోని కమిషనర్ క్యాంప్ కార్యాలయం లో కమిషనర్ పమేలా సత్పతి ఓటును రెవెన్యూ అధికారి సుదర్శన్ ఆధ్వర్యంలో పరిశీలించి కమిషనర్ కు చూపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రబ్బానీ, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.