మంగపేట: మండలం లోని కమలాపురంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంగపేట తహశీల్దార్ రమాదేవి కమలాపురం అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం బయటకు రావడంతో కమలాపురం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతను కూరగాయల వ్యాపారం చేస్తాడు. అతనికి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ, ఏటూరునాగారం ఓ ప్రైవేటు హాస్పిటల్ లో 2 రోజులు వైద్యం చేయించుకున్నట్లు తెలిసింది. స్థానిక ఆర్ఎంపి డాక్టర్లు సైతం వైద్యం చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అతని ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలు సేకరించలేదు. దీనితో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న కునూరు వేరేశంకు కరోనా పాజిటివ్ వచ్చిందని పై అధికారులు తహసీల్దార్ కు రిపోర్ట్ పంపి అలర్ట్ చేయాలని అధికారులకు సమాచారం అందించారు.

అయితే ఆయన స్థానికంగా ఎక్కడ వైద్యం చేయించుకున్నాడు ఎవరెవరిని కలిశాడు అన్న దానిపై పూర్తిగా సమాచారం సేకరించాల్సి ఉంది. ఆయన ఎక్కువగా గ్రామంలో తిరిగే వ్యక్తి కాదు వారం రోజులుగా ఇంట్లోనే ఉనట్లు తెలిసింది. ఐతే అతన్ని వరంగల్ గాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమలాపురంలో ఇతర జిల్లాల నుండి రాష్ట్రల నుంచి అనేకమంది వచ్చారని తెలిసింది. వీరందరికి పరీక్షలు చేశారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామంలో మాస్కులను మరిచారు. గుంపులు గుంపులుగా మీటింగ్ లు బెల్టుషాపులలో సిట్టింగ్ లు వేస్తూ సరదాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటన చేసి ప్రత్యేక దృష్టి సారించాలని మండల వాసులు కోరుతున్నారు.