వరంగల్ మహానగర పాలక సంస్థ కమీషనర్ గా పి. ప్రావీణ్య శుక్రవారం ప్రధాన కార్యాలయం లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమీషనర్ సి.హెచ్.నాగేశ్వర్, ఎస్.ఈ. సత్యనారాయణ,సి.ఎం.హెచ్.ఓ.డా.రాజారెడ్డి, సి.హెచ్.ఓ.సునీత, ఎక్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర రావు, పిఆర్ ఓ ఆయూబ్ అలీ, డి.ఎఫ్.ఓ.కిషోర్, సిటీ ప్లానర్ బానోతు వెంకన్న, సెక్రటరీ విజయ లక్ష్మి, డిప్యూటీ కమీషనర్ లు జోనా,రవీందర్ యాదవ్,పన్నుల అధికారి శాంతి కుమార్, జె.ఏ. ఓ.లు ఉమాకాంత్, సుధాకర్, హెచ్ ఓ ప్రెసిల్లా, ఈ.ఈ.లు శ్రీనివాస రావు, శ్రీనివాస్, రాజయ్య, సిబ్బంది తదితరులు కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

విభాగాల వారిగా అధికారులతో పరిచయం చేసుకున్న కమీషనర్. అనంతరం మాట్లాడుతూ: GWMC పరిధిలో వివిధ పథకాల క్రింద ఆయా విభాగాల ద్వారా కొనసాగుతున్న, పెండింగ్ లో ఉన్న, చేపట్టబోయే అభివృద్ధి పనుల అప్డేటెడ్ సమాచారం సంబంధిత విభాగ అధికారుల వద్ద సిద్ధంగా ఉండాలని, విభాగాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా కమీషనర్ అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన మునిసిపల్ చట్టం-2019 గురించి అధికారులందరూ క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు.