ఎంజీఎం: జిల్లాలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి మృతి చెందాడని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి తెలిపారు. వరంగల్ శంభునిపేటకు చెందిన 70 ఏళ్ల వ్యక్తి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధప డుతుండగా ఎంజీఎం ఆస్పత్రిలోని ‘ సారీ ‘ వార్డు లో మంగళవారం మధ్యాహ్నం చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో శాంపిలు కేఎంసీ వైరాలజీ ల్యాబ్ పంపించగా సదరు వ్యక్తి రాత్రి మృతి చెందడంతో మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. బుధవారం సాయంత్రం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారిస్తూ నివేదిక అందడంతో నిబంధనల మేరకు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అలాగే , జిల్లా కేంద్రంలో నివాసముంటున్న మంచిర్యాలకు చెందిన పోలీసు ఉద్యోగికి కూడా కరోనా సోకినట్లు తేలింది..