వరంగల్: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శుక్రవారం ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటో మౌంటెడ్ స్ప్రెయింగ్ యంత్రాలను మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ: కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి నగరంలోని 66 డివిజన్లలో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయడానికి 15 ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రెయింగ్ యంత్రాలకు తోడుగా ఇరుకైన సందుల్లోనూ పిచికారీ చేయడానికి వీలుగా 15 ఆటో మౌంటెడ్ స్ప్రెయింగ్ యంత్రాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బందితో ఇప్పటి వరకు 232 కొవిడ్ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం జరిగిందన్నారు. కొవిడ్ మృతదేహాలను తరలించేందుకు రెండు వైకుంఠ రథాలను బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సమాచారం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, నగరం లోని ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ప్రదర్శించాలని, ఇప్పటికే ప్రధాన కార్యాలయంలో కొవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్ చార్జి కమిషనర్ సత్యనారాయణ, డీఈ. రవీందర్, సూపర్ వైజర్ సాంబయ్య, నరేందర్, హెల్త్ ఇన్ స్పెక్టర్ మధుకర్, సాంకేతిక నిపుణులు సురేష్, తదితరులు పాల్గొన్నారు.