కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో కరోనా పాజిటివ్ రావడంతో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా నిర్ధారణ అయిందనే మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. హసన్ పర్తి మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మేకల సౌందర్య అనే వృద్ధురాలికి కరోనా నిర్దారణ కావడంతో ఎంజీఎం ఐసోలేషన్ కు తరలించడానికి వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేశారు. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య చేసుకుంది.