కరోనా బాధితుల పట్ల ఎంజీఎం వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన వైద్యం అందించడం లేదంటూ రోగి బంధువులు కోవిడ్‌-19 వార్డు ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. వైద్యమందించక పోవడం వల్లే కరోనా పాజిటివ్‌ వ్యక్తి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఎం సిబ్బంది, రోగులు తెలిపిన వివరాల ప్రకారం: వర్ధన్నపేట మండలం నందిగామ ప్రాంతానికి చెందిన వ్యక్తి(55)కి మూడు రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, వరంగల్‌ ఎంజీఎం కోవిడ్‌-19 వార్డులో చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు.

దీంతో కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు కోవిడ్‌-19 వార్డులోని అద్దాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలువరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ: కోవిడ్‌-19 వార్డులో పరిస్థితులు అత్యంత దారు ణంగా ఉన్నాయన్నారు. సరైన పోషకాలతో కూడిన ఆహారం అందించ డం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న కరోనా రోగులకు వెంటి లేటర్స్‌ పెట్టకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.