నర్మేట మండలంలోని మచ్చుపహాడ్ గ్రామ పరిధి సూర్యబండ తండాకు చెందిన మురారీ నాయక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది. దీంతో వైద్యల సూచన మేరకు మురారీ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. నిరుపేద అయిన మురారికి కరోనా రావడంతో గ్రామస్తులు అతడి కుటుంబ సభ్యులను కూడా బయటికి రానివ్వడం లేదు. పిల్లలకు పాలు, కూరగాయలు తెచ్చేవారు కూడా లేకపోవడంతో తన ఇబ్బందులను మురారీ ట్విట్టర్ ద్వారా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కవితకు తెలిపాడు.

వెంటనే స్పందించిన కవిత జనగామ జాగృతి జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళితో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే మురారీ నాయక్‌కు సాయం చేయాల్సిందిగా కోరారు. కవితక్క ఆదేశాల మేరకు మురళి, జనగామ జాగృతి బృందంతో కలిసి బియ్యం, నిత్యావసరాలతో పాటు పండ్లు, పాలు, కూరగాయలను బాధితుడికి అందజేశారు. అంతే కాకుండా ఏ అవసరం ఉన్నా తమకు చెప్పాలని, కవితక్క మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.