వరంగల్‌: కరోనా విజృంభనతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వచ్చాయి. పాలకులతో పాటు వ్యాపారులు, ప్రజలు ఇతర సమూహాల్లో కూడా ఊహించని మార్పులు వచ్చాయి. ఇదే నేపథ్యంలో మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి దాడులు చేయొద్దని మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది.

మల్కన్‌గిరి కోరాపుట్-విశాఖ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఆడియో టేపు విడుదల అయింది. ఈ ఆడియో టేపులో వచ్చిన సందేశం ప్రకారం.. వైరస్‌ను నిరోధించడానికి పాలకవర్గాల ప్రయత్నాలకు ఆటంకం కలిగించొద్దని మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు కైలాసం అనే వ్యక్తి సందేశం ఇచ్చారు.