కర్ఫ్యూ సమయంలో ఎలాంటి కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చే వాహనాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

కోవిడ్-19 నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాయంత్రం 7గంటల నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించడం జరుగుతోంది. ఈ కర్ఫ్యూ సమయంలో మెడికల్ షాపులు మరియు హస్పటలకు మినహాయించి ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి ఎవరైన కారణం లేకుండా అనవసరంగా రోడ్ల మీదకు వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతుందని, ముఖ్యంగా కర్వ్యూ సమయానికి ముందే ప్రభుత్వం మినహయింపు ఇచ్చిన వస్తువులకు సంబంధించిన షాపు యజమానులు సాయంత్రం ఆరుగంటలలోపే షాపులను మూసివేసి తిరిగి తమ ఇండ్లకు చేరుకోవాల్సి వుంటుందని.

అలాగే ప్రభుత్వ, ప్రవైయిట్ ఉద్యోగులు కూడ తమ కార్యకలపాలను పూర్తి చేసుకోని సాయంత్రం 7గంటలలోపే ఇండ్లకు చేరుకోవాలని సూచించడమైనది. అదే విధంగా అత్యవసర విభాగాలకు సంబంధించిన ప్రభుత్వోగులకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని, కర్ఫ్యూ సమయాల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని. కరోనా నివారణ కోసం ప్రతి పౌరుడు తన వ్యక్తిగత భాధ్యతతో పాటు, ప్రభుత్వం సూచనలను పాటించాల్సిన భాధ్యత అందరిపై వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము