వరంగల్‌ ఉర్సు ప్రాంతానికి చెందిన వేల్పుగొండ మధుకర్‌ హన్మకొండ అర్బన్‌ కలెక్టరేట్‌ వద్ద కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు, తన సోదరుడి మధ్య భూతగాదాలు ఉన్నాయని, ప్రతి విషయంలో తన సోదరుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు.

ఈ విషయమై స్థానిక మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణి సందర్భంగా కలెక్టర్‌ను కలిసి తన సమస్యను విన్నవిద్దామని వచ్చాడు. సోమవారం ప్రజావాణి రద్దు చేశారు. అక్కడకు వచ్చిన మధుకర్‌ ఆత్మహత్యాయత్నం చేస్తుండగా గమనించిన కలెక్టరేట్‌ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుబేదారి పోలీసులు అతడ్ని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.