వరంగల్: రూరల్ జిల్లా నర్సంపేట పట్టణం నెక్కొండ రోడ్డులోని శ్రీనివాస వైన్స్ షాపును తనిఖీ చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. షాపులో ఉన్న పలు బ్రాండ్ కు సంబంధించిన 83 బాటిళ్ల కల్తీ మద్యాన్ని గుర్తించి షాపుపై కేసు నమోదు చేయడంతో పాటు గోపి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో వరంగల్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐలు శ్రీనివాసులు, మాధవీలత, ఎస్సైలు భిక్షపతి, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.