పెట్రో ధరలపై కాంగ్రెస్ పార్టీ ధర్నాలో నిరసన తెలిపేందుకు తీసుకుని వచ్చిన ఎద్దులు బెదిరాయి. కార్యకర్తల నినాదాలకు బెదిరిపోయిన ఎద్దులు బండిని పట్టుకున్న వారిని అదిలించుకుని పరుగులు తీశాయి. అడ్డంగా ఎదురొచ్చిన బైక్ ల ను తోసుకుంటూ పరుగులు తీయడంతో కొంత మంది కిందపడిపోయారు. ఊహించని రీతిలో ఎద్దులు బెదిరి పరుగులు తీయడం కలకలకం రేపింది. ఎద్దుల బండి యజమాని ఎద్దులను అపే ప్రయత్నం చేస్తుంటే బెదిరిన ఎద్దులు పట్టించుకోకుండా లాక్కుంటూ చాలా దూరం వెళ్లాయి. ఒకచోట ఎద్దుల బండి యజమాని కింద పడి పోయినా, ఎద్దుల బండి తాడు పట్టుకుని ఎద్దులను ఆపటంతో పెను ప్రమాదం తప్పింది.

హఠాత్తుగా జరిగిన సంఘటనతో షాక్ గురైన వారు ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్, డిజిల్ దరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. సింబాలిక్ గా ఉంటుందని ఎద్దుల బండిని తీసుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎద్దుల బండి,రిక్షాల పై నిలబడి నిరసన తెలిపేందుకు జిల్లా పార్టీ కార్యాలయం నుండి బయలుదేరారు. ఎద్దుల వద్దకు కొంత మంది కార్యకర్తులు ఒకే సారి పరుగులు తీయటంతో అవి బెదిరి పరుగులు తీసాయి. ఈ సంఘటనలో నలుగురికి స్వల్ప గాయలు అయ్యాయి. కొద్దిసేపట్లోనే ఎద్దుల బండిని అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చు కున్నారు. బెదిరిన ఎద్దులను పక్కన వదిలేసీ కార్యకర్తలే బండిని లాగుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.