ప్రేమించాను అన్నాడు! పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడు. చివరికి అనాథ యువతిని తల్లిని చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది..

వివరాలు: వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలానికి చెందిన ఓ యువతి తల్లిదండ్రులు 10 ఏళ్ల క్రితం మృతి చెందడంతో నాటి నుంచి బంధువుల ఇళ్లలో ఉంటూ, కాలం వెల్లదీస్తుంది. ఈ క్రమంలో తన బంధువు యాకయ్య ఆమెకు దగ్గరై మాయమాటలు చెప్పి గర్భవతిని చేసి మొహం చాటేశాడు. దీంతో ఆమె ప్రశ్నించగా నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. కంగుతున్న ఆమె ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి అగమ్యగోచరంగ మారింది.

ఈ విషయం తెలుసుకున్న 51వ డివిజన్‌ ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ వృద్ధ్దాశ్రమ నిర్వాహకులు యాకుబీ, చోటు డీసీపీవో మహేందర్‌రెడ్డి సహాయంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన కలెక్టర్‌ హరిత జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్యను ఆ యువతికి వసతి సౌకర్యం కల్పించాలని కోరగా, ఈ నెల 11న సహృదయ ఆశ్రమంలో చేర్పించారు. గర్భవతి అయిన యువతి ఆదివారం రాత్రి హన్మకొండలోని మిషన్‌ ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు దవాఖానకు వెళ్లి జన్మనిచ్చిన తల్లిని, ఆడబిడ్డను చూసి పలకరించి, తమ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీపీవో మహేందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.