వరంగల్ అర్బన్: జిల్లాలో దారుణం బుధవారం చోటుచేసుకుంది. భార్య అనే కనికరం లేకుండా మేకను కోసినట్లు కోసి చంపిన కసాయి భర్త ఘటన నగరంలో కలకలం రేపింది. కాజీపేట రైల్వే క్వాటర్స్ లో నివాసం ఉంటున్న మేకల శ్రీనివాస్ తన భార్య రమను గొంతుకోసి హత్య చేశాడు. స్థానికులు కుటుంబ కలహాలే ఈ హత్య కారణం అంటున్నారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.