ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేల సత్ఫతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1 నుండి 8 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఆమె బుధవారం నగరంలోని 33 వ డివిజన్ లోని భట్టుపల్లి, కొత్తపల్లి, 35 డివిజన్ కడిపికొండ లోని కాలనీలను ఆకస్మికంగా సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి మరింత సమర్ధంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

కాలువలు శుభ్రం లేకపోవడం వల్ల దుర్గంధం ఏర్పడి, దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతాయని, క్రమం తప్పకుండా డ్రైన్లను శుభ్రం చేస్తూ, చెత్తా తొలగిస్తూ బ్లీచింగ్ పౌడర్, అంటి లార్వా ఆయిల్ బాల్ లు కాలువలలో వేయాలని అన్నారు. భట్టుపల్లిలో డ్రైనేజీ సమస్య, కొత్తపల్లిలో రోడ్ వేయాలని కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.