{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_sticker"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":2,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"total_editor_time":89,"brushes_used":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579497819035","total_effects_time":0,"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579497819078","sources":["306566523051201"],"layers_used":0,"width":1242,"height":640,"subsource":"done_button"}

మెడిసిన్ స్టూడెంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శనివారం రేగొండ మండలం కనిపర్తిలో జరిగింది. మెడిసిన్ చదువుతున్న తుమ్మనపల్లి వంశీ(25) శనివారం ఉదయం బావిలో శవమై కనిపించాడు. కాళ్లు, చేతులు కట్టేసి దుండగులు బావిలో పడేశారు. ఈ ఉదయం బావి యజమాని మోటర్ ఆన్ చేయడానికి వెళ్లేసరికి బావిలో డెడ్ బాడీ కనిపించింది. వెంటనే గ్రామస్ధులకు విషయం చెప్పడంతో మృతుడిని బయటికి తీశారు.

అంతకు ముందే చంపేసి కాళ్లు, చేతులు కట్టేసి బావిలో పడేసినట్లు తెలుస్తుందని తెలిపారు గ్రామస్థులు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆత్మహత్య ? హత్యా ?

వంశీని హతమార్చేంత కక్షలు గ్రామంలో ఎవరికీ లేవని పలువురు పేర్కొంటున్నారు. డాక్టర్ ​కావాలనే పట్టుదలతో మెడిసిన్​ ఫ్రీ సీటు సాధించాడని తెలిపారు. అందరితో కలివిడిగా ఉండేవాడని అన్నారు. అయితే గత సంవత్సరం ఇదే వ్యవసాయ బావిలో దూకి తాను చనిపోతున్నట్లుగా కుటుంబీకులకు సమాచారం అందించి మళ్లీ మోటార్​పైప్​సహాయంతో ఒడ్డుకు చేరినట్లుగా తెలిపారు. శుక్రవారం కాలేజీకి అని వెళ్లిన వంశీ సాయంత్రం చలివాగు ఒడ్డున ముభావంగా కూర్చుని ఉండటం గ్రామస్తులు చూసినట్లుగా చెబుతున్నారు. రాత్రి 8 గంటలకు తండ్రి ఫోన్​చేయగా ఖమ్మం చేరుకున్నట్లుగా చెప్పిన కొడుకు తెల్లవారేసరికి తన వ్యవసాయ బావిలోనే శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకుని కాల్​డేటాను పరిశీలిస్తున్నారు…