దేవిపట్నం గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలు వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం కడిపికొండలోని వారి స్వగృహలకు చేరుకున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో బస్కే అవినాష్, బస్కే రాజేందర్ మృతదేహలు మంగళవారం ఉదయం 2 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాయి. విహారయాత్ర కోసం ఇంటి నుంచి వెళ్లిన వారు విగతజీవులుగా తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.మృత దేహాలు కడిపికొండకు చేరుకోవడంతో కుటుంబ సభ్యలు, బంధువుల రోధనలతో విల్లదించి అందరు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు.