వరంగల్‌ సీకేఎం ఆసుపత్రికి వెళ్లేదారిలోని ఓ చికెన్‌ దుకాణంలో కుళ్లిన చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వచేసి వినియోగదారులకు అదే చికెన్‌ను విక్రయిస్తుండగా వినియోగదారుల ఫిర్యాదు మేరకు కార్పొరేషన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కుమారస్వామి ఇంతేజార్‌గంజ్‌ పోలీసులతో కలిసి దాడి చేసి ఫ్రిజ్‌లో నిల్వచేసిన 15 కోళ్ల మాంసాన్ని సీజ్‌ చేశారు. వినియోగదారులను మోసం చేస్తున్న దుకాణదారుడికి రూ.10వేల జరిమానా విధించారు.