{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_sticker"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"total_editor_time":153,"brushes_used":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581648054148","total_effects_time":0,"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581648054193","sources":["228636666006202","301248758454201","238909876100202"],"layers_used":0,"width":1280,"height":720,"subsource":"done_button"}

తెలంగాణలో రెండో అతి పెద్ద సిటీగా పేరుగాంచిన వరంగల్, అభివృద్ది చెందడానికి ముందుకు అడుగులు వేస్తుంది. కాగా ఇప్పటికే వరంగల్‌లో రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను స్థాపించాయి. ఈ నేపథ్యంలోనే మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న వరంగల్‌లో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీటర్ లో పేర్కొన్నారు.

తెలంగాణను అభివృద్ది పరిచే దిశగా వరంగల్ లో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సెంటర్‌ను 1.5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారని, ఆ సంస్థ వ్యవస్ధాపకుడు సీఈవో వంశీరెడ్డి తెలిపారని అన్నారు. ఈ సంస్థ ద్వారా దాదాపుగా 500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని తెలిపారు. అనంతరం ఈ సంస్థ వ్యవస్థాపకుడు వంశీరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక పోతే ఈ సంస్థను మడికొండ ఐటీపార్కులోని ఎకరం స్థలంలో ఏర్పాటుచేయనున్నట్టు వారు తెలిపారు. ఇప్పటికే వరంగల్ లోని మడికొండలో టెక్‌ మహీంద్రా, సైయెంట్‌ తమ బ్రాంచీలను ఏర్పాటుచేశాయి. ఎంతొ ప్రఖ్యాతి గాంచిన ఈ ఐటీ కంపెనీల సరసరన ఇప్పుడు క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో నగరం మరింత అభివృద్ది చెందనుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ద్వితీయశ్రేణి నగరం వరంగల్‌కు ఐటీ కంపెనీలు వడివడిగా తరలివస్తున్నాయి. దీంతో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో అంతర్జాతీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ కూడా వరంగల్‌లో తన కార్యకలాపాలను సాగించేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇక పోతే క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ఈ నెల 16న బ్రాంచీ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నామని, దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు ప్రముఖులు హాజరవుతారని క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌ కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి మీడియాకు తెలిపారు.