ములుగు జిల్లా, మంగపేట హేమాచల
నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఓ విచిత్ర
సంఘటన చోటు చేసుకుంది. ఓ జంట పెళ్లి తంతులో
భాగంగా తలంబ్రాల కార్యక్రమం జరుగుతుండగా,
అంతలో ఓ కోతి అనుకోని అతిథిలా వధూవరుల
తలపై దూకింది. దీంతో అంతా కొత్త జంటకు కోతి
ఆశీర్వచనంలా భావించారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్
మీడియాలో తెగ వైరల్ గా మారింది.