వరంగల్ రూరల్: జిల్లాలోని కొమ్మల లక్ష్మి నరసింహ స్వామి జాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా మమునూర్ ఏసీపీ నరేష్ కుమార్ మాట్లాడుతూ: జాతరలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, బందోబస్తును సీసీ కెమెరాల సహాయంతో జాతర కంట్రోల్ రూమ్ నుండి 24/7 పర్యవేక్షణ 300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసాం అని, ఈ జాతరలో వివిధ రాజకీయ పార్టీల పేరున ప్రభ బళ్ళు కట్టడం, డీజేలు పెట్టడం, రాజకీయ పార్టీలపేర బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టడం నిషేధంపై సూచనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి ఎవరైనా అందుకు విరుద్ధముగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొనబడును అలాగే వారి బళ్ళును సీజ్ చేయబడునని తెలిపారు.