{"subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1598273088710","source":"share_action_sheet","origin":"gallery","sources":["290279836040211","326606682052211"],"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1598364390669"}

శుక్రవారం రోజున జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 24వ డివిజన్ కార్పొరేటర్ గుండు ఆశ్రిత విజయ్ రాజ్ మాట్లాడుతూ: ఇటీవల కురిసిన వర్షాల వల్ల మా 24వ డివిజన్లోని హంటర్ రోడ్, భద్రకాళిబండ్, బొందివాగు, సంతోషిమాత కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, యన్ టి ఆర్ నగర్ కాలనీ, బాబీ ఫంక్షన్ హాల్ ఏరియా, గంగపుత్ర వీధి, రామన్నపేట ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురై సుమారు వెయ్యి ఇండ్లలో ఈ ప్రభావం పడి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశం మేరకు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ KT రామారావు గారు మా 24వ డివిజన్లోని ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలందరితో మాట్లాడి వారందరికీ మనోధైర్యం కల్పించి, మల్లీ వర్షాలు వస్తే ముంపునకు గురి కాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినందుకు అంతేకాకుండా 25 కోట్ల రూపాయలను ప్రకటించినందులకు మా డివిజన్ ప్రజలందరి తరుఫున ముఖ్యమంత్రి KCR గారికి, మంత్రివర్యులు KTR గార్లకు ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వర్షాలు బాగా వచ్చినప్పుడు బెస్తంచెరువు, ఉర్సు చెరువు, న్యూశాయంపేట చెరువు, బట్టుపల్లి చెరువు, మరియు గొలుసుకట్టు చెరువుల ద్వారా 10వేల క్యూసెక్కుల నీరు డిశ్చార్జి ఫ్లో ఉండటం వలన ఈ బొందివాగు నాలా వద్దకు వచ్చే సరికి ఇక్కడ వెడల్పు తక్కువగా ఉండటం వల్లనే మా డివిజన్లోని కాలనీలు ముంపునకు గురౌతున్నాయని కౌన్సిల్ లో వివరించారు.

గౌరవ మంత్రి శ్రీ KTR గారు శాశ్వత పరిష్కారం కొరకు ఈ బొందివాగు నాలాను వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానన్నారు. భవిష్యత్తులో 15వేల క్యూసెక్కుల వాటర్ డిశ్చార్జి ఫ్లో కి సరిపడా బొందివాగు నాలాను కనీసం 100ఫీట్ల వెడల్పుగా నిర్మించాలని సంబంధిత అధికారులందరినీ ఈ కౌన్సిల్ ద్వారా కోరుతున్నానని గుండు ఆశ్రిత విజయ్ రాజ్ అన్నారు. అంతే కాకుండా ఖిలావరంగల్ అగర్తల, శివనగర్, మైసయ్యనగర్ నుండి వచ్చే డ్రైనేజీ నీరంతా కూడా హంటర్ రోడ్ 12 మోరీల వద్దకు చేరుకుంటున్నదని, ఈ ఫ్లో కి సరిపడా వెడల్పు ఇక్కడ లేనందున ఉన్నది కూడా డ్యామేజీ అయి ఉన్నందున ఫ్లో కు తగ్గట్టుగా కెపాసిటీని పెంచి ఈ 12 మోరీలను వెడల్ప చేయాలని, ఈనాలాను అలంకార్ జంక్షన్ వరకు వెడల్పుతో నిర్మించాలని కోరారు. ఈ 12 మోరీల కూడలిని జంక్షన్ గా అభివృద్ధి చేయాలని ఈ కౌన్సిల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని గుండు ఆశ్రిత విజయ్ రాజ్ అన్నారు.