వరంగల్ అర్బన్ జిల్లా కమలపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేసి, 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కమలాపూర్ సీఐ డి రవిరాజు తెలిపిన వివరాల ప్రకారం: విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం మండలంలోని ఉప్పల్ గ్రామంలో తెల్లవారుజామున అనుమానాస్పదంగా వెళ్తున్న ఎండి శామిద్ (35) ను తనిఖీ చేయగా ఆరు కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి విలువ దాదాపు 60 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితురాలు గతంలో కూడా మూడు కేసులతో సంబంధం ఉన్నట్లు వారు పేర్కొన్నారు.