రాష్ట్రంలో సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో విచారణను 48రోజుల్లోనే పూర్తిచేసి సంచలన తీర్పు చెప్పింది వరంగల్ కోర్టు. ఈ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు వరంగల్ ఫస్ట్ అడిషనల్ జడ్జ్ జయకుమార్. ఇది క్షమించరాని నేరం అనీ ముక్కుపచ్చలారని చిన్నారిపై రాక్షసుడిగా ప్రవర్తించి ఆమె ప్రాణాలు తీసిన నిందితుడికి బతికే హక్కే లేదని న్యాయమూర్తి చెప్పారు…