మోరంచపల్లి గ్రామంలోని బస్టాప్ వద్ద తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు చేసిన ఓ ముళ్లే పడేసి వెళ్లారు, అందులో ఎమున్నదో అని విప్పి చూస్తే కళ్ళు బైర్లు కమ్మేలా నిమ్మకాయలు, మొలలు, బొక్కలు, పిండి పదార్ధంతో తయారు చేసిన బొమ్మలు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, కోడి తలకాయలు, కోడిగుడ్లు, గవ్వలు ఇలా అన్నీ కలిపిన ఒక మూటలో కట్టి మూడు బాటలపై సెంటర్లో పడవేసి వెళ్లారు తెల్లవారుజామునే లేచిన గ్రామస్తులు ఆ మూటలో ఏముందోనని కాసేపు ఆందోళన చెందారు,

ఆ తర్వాత పక్కనే ఉన్న షాపు యజమానులు ఇందులో ఏముంది అని ఓ కర్రతో కదిలించి చూడగా అందులో ఉన్నవన్ని చూసి షాక్ అయ్యారు, పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాలు నమ్మవద్దని అనేక కార్యక్రమాలు చేపడుతున్న కొందరు దుండగులు పూజారుల అవతరమెత్తి చేసే మోసాలకు ప్రజలు బలవుతూనే ఉన్నారు, వారి జేబులు కాళీ చేసుకుంటున్నారు. ప్రతి రోజు ఏదో ఒక చోట ఇలా జరుగుతూనే ఉన్నాయి, పరకాల-భూపాలపల్లి 356వ ప్రధాన జాతీయ రహదారిపై ఇలా జరగడం గ్రామస్తులందరూ భయాందోళనకు గురవుతున్నారు, ఇలాంటి చేతబడి క్షుద్రపూజలు ఇప్పటికైనా మూఢనమ్మకాలను నమ్మవద్దు అని గ్రామ పెద్దలు అంటున్నారు.