వరంగల్ జిల్లా లో జరుగుతున్న అభివృద్ధి పనులును నేడు పరిశీలించి అధికారులు తో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభార్వాల్

54వ డివిజన్ పరిధిలో ఉన్న దేవాదుల మూడో దశ టన్నల్ పనులను ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మిత సబర్వాల్ పరిశీలించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో స్మిత సబర్వాల్ దేవాదుల పనులను పరిశీలించి, వరంగల్ అర్బన్ , వరంగల్ రూరల్ జనగామ జిల్లాల కలెక్టర్లుతో సమీక్షా సమావే శం నిర్వహించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భూ సేకరణ పూర్తి స్థాయిలో సమీక్షించి రైతులకు న్యాయం చేయాల నీ కలేకర్లకు తెలిపారు. దేవాదుల పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు స్మిత సబర్వాల్ ములుగు జిల్లా తుపాకులగుడెం బ్యారేజి పనులను పరిశీలించి వరంగల్ అర్బన్ జిల్లా దేవన్నపేట రింగ్ రోడ్ పై హెలిప్యాడ్ లో దిగారు .స్మిత సబర్వాల్ కు జిల్లా కలెక్టర్లు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం తెలిపారు.