ద్విచక్రవాహనాలపై వెళ్తున్న జూనియర్ డాక్టర్లపై ఆకతాయిలు దాడి చేసిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల హాస్టల్ నుంచి జూనియర్ డాక్టర్లు ప్రదీప్, శశికాంత్, రవీందర్ రెండు బైక్‌లపై బుధవారం అర్ధరాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్దమ్మగడ్డ క్రాస్ వద్దకు రాగా నే ఆరుగురు యువకులు బైక్‌లపై వేగం గా వచ్చి.. కర్రలతో దాడి చేశారు. దాడి లో ప్రదీప్, శశికాంత్, రవీందర్ గాయపడ్డారు. సమాచారమందుకున్న బాధితుల స్నేహితులు వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. దాడికి పాల్ప డ్డ వారిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.